Thanda Harish Goud

Thanda Harish Goud

~~ఆకాశాలు,సూర్యుళ్ళు,సముద్రాలు-సైనికులు~~

సముద్రాన్ని పట్టుకొచ్చి
కాగితం మీద ఏమని రాయగలుగుతావు

1.ఆకాశానికి రాత్రి,పగలు అలవాటయ్యాయనా?

2.పొద్దున్నే సూర్యుడు నిద్రలేవకపోతే
తామరలు ఎక్కడివక్కడ చచ్చి పడి ఉంటాయనా?

3.చందమామకు పౌర్ణమి రోజు కూడా
మంచుముక్కల ఫలహారమేననా?

చుక్కలకు తెలుసు
ఆకాశం తమకు గొడుగవుతుందని..

తామరలకు తెలుసు
సూర్యుడు తీగై చుట్టూ కంచె నాటుతాడని..

చందమామకు తెలుసు
మంచుముక్కను దిష్టిచుక్కలా ఎలా పెట్టుకోవాలో..

రాయాలి
భరతభూమి చుట్టూ
నిప్పుకణికలు గస్తీకాస్తున్నాయని
సముద్రాలు ఉప్పొంగుతున్నాయని
ఆకాశాలు కన్నెర్రచేస్తున్నాయని
సూర్యుళ్ళు రాత్రి,పగలు భగభగ మండిపోతున్నారని..

రాయాలి
ప్రాణాలను సరిహద్దుగా నాటి
రక్తాన్ని నీరుగా పోసి,
త్రివర్ణ పతాకాన్ని విరబూయిస్తున్న
ఆ సముద్రాలు,ఆ ఆకాశాలు,ఆ సూర్యుళ్ళు
సైనికులని..

తండ హరీష్ గౌడ్..[/vc_column_text][/vc_column][/vc_row]

No Comments

Post A Comment

You don't have permission to register