Sai Bharath

Sai Bharath

💔గతం💝

నాకైనా నీకైనా
జ్ఞాపకపు విత్తనం హృదయపు
మధ్యభాగంలో మొలకెత్తినప్పుడు
గతమనే అద్దం పిలుస్తుంటుంది

ఎవరూ చూడకుండా ఉన్నప్పుడు
ఆ అద్దం నిన్ను లాగేసుకుంటుంది

ఆ సమయాలు కొంచెం చప్పగా
కొంచెం చేదుగా కొంచెం రక్తపు
వాసనతో కొంచెం మాధుర్యపు
రుచితో కలిసిపోయి నిన్ను
తీసుకెళ్తాయి

ఎత్తైన విషయాలు లోతును
నేర్పిస్తాయి
లోతైన అగాధాలు ఎత్తులను
కొలిపిస్తుంటాయి

కళ్ల నుండి సంతోషం కారుతుంది
కారిపోతున్న సంతోషంలో బాధ
కలిసిపోయి అనుభవ ఆయుధాలను
తయారుచేస్తుంది

నిన్నైనా నన్నైనా
మళ్లీ అద్దం వాస్తవపు
సముద్రంలోకి విసిరివేస్తుంది
కొన్ని గంటల తరువాత

నవ

No Comments

Post A Comment

You don't have permission to register