Chandrasekhar Pottepalem

Chandrasekhar Pottepalem

జ్ఞాపకాల లతలు
***************

నువ్వెప్పుడొస్తావో ఏమో కానీ!
శిశిరం నుంచి వసంతం దాకా
ఇక్కడే మఠమేసుకొని చూస్తున్నా!

ఎందుకో ఎప్పుడు నీ ఊసొచ్చినా!

విరగబూసిన ఒంటరి మల్లెచెట్టు గుర్తుకొస్తుంది
విరిగిన మానునుంచి చిగురిస్తున్న కొత్త కొమ్మలావుంటుంది

బూడిద రంగు మబ్బుల దొంతరుల నడుమనించి
చిద్విలాసంగా తొంగిచూస్తున్న
మెరుపు కనుల చంద్రుడిలా ఉంటుంది

నిండుగా పండిన పచ్చటి చేలల్లో
నిటారుగా ఎదిగిన వెదురు పొదల్లో
పండుగచేసుకుంటున్న పిచుకల దండులా ఉంటుంది

నీ జ్ఞాపకాల లతలు వాడిపోకమునుపే
నా మీద దయచూపించమని వేడుకుంటున్నా!

No Comments

Post A Comment

You don't have permission to register