Bhanu Murthy

Bhanu Murthy

సర్జికల్ స్త్రైక్
————————————
ఫుల్వామా పచ్చని కాశ్మీరంలో
ఒక మతోన్మాది చేసిన హింస రచన
ఒక పిరికిపంద చేసిన ద్వంస రచన
ఒక ఉగ్రవాది ఆర్ డి ఎక్స్ బాంబరుగా మారి
యాభై మంది సైనికులను‌ బలి తీసుకొంటే
నా దేశం అట్టుడికి పోయింది
నూట ఇరవై కోట్ల ప్రజల గుండెల్లో
ప్రతీకార జ్వాలలు రగిలాయి
ఉగ్రవాదుల పెంచి పోషిస్తున్న పాకిస్తాన్
మతాన్ని అడ్డం పెట్టుకొని మన దేశంలో
అశాంతి విస్ఫోటనాలు చల్లుతున్న ఉగ్ర దేశం
అడుగడుగునా మతోన్మాదాన్ని నూరి పోస్తున్న
దాయాది దేశానికి
శాంతి మంత్రాలు వినబడవు
ఈ మట్టి రేణువులు స్నేహ హస్తాన్ని అందిస్తే
నువ్వు తుపాకీ గుళ్ళను అందిస్తావు
అందుకే రక్త పాతాన్ని సృష్టిస్తావు
మానవత్వం లేని మతం ఎందుకురా?
దేవుడు పేరు చెప్పి మారణ హోమం నీకెందుకురా?
మా మిరేజిలు కురిపించాయి నిప్పుల వర్షం
మా వాయు సేనలు ఉగ్ర స్థావరాల్ని పగల గొట్టాయి
మా సర్జికల్ స్త్రైక్ లో రాక్షస సంహారం జరిగింది
మా దేశం జూలు విప్పిన కొదమ సింహం
వందే మాతర మంటూ గర్జిస్తే ఆకాశం వూడి పడుతుంది
జై హింద్ అంటే పర్వతాలు పగిలి పోతాయి
మా భారత దేశం చేస్తున్నది ధర్మ పోరాటం
గెలుపు మాదే ! అధర్మం మీద విజయం మాదే!

( 26.02.2019 నాడు మన వీర వాయు సేనలు పి వో కె లోని ఉగ్ర స్థావరాల్ని నిర్వీర్యం చేసిన సందర్భంగా వ్రాసిన కవిత)

No Comments

Post A Comment

You don't have permission to register