Anand Joy

Anand Joy

_|| నిజానిజాలు మీడియాకెరుకా..! ||_
రాజకీయ రంగులు..
సెంటిమెంట్ సూక్తులు..
అదిరిపోయే సౌండులు..
జవాన్ల రక్తము..

సర్జికల్ స్టైక్..
సోషల్ మీడియా హైక్..
పొలిటీషియన్ లైక్..
వెబ్ డిజైనర్ స్ట్రోక్..

ఎన్నికలొస్తున్నాయి..
విమానాలు తిరుగుతున్నాయి..
విపక్షాలు దిక్కులు చూస్తున్నాయి..
జనాల మేదళ్లు మారుతున్నాయి..

నిజా నిజాలు మేధావుల కెఱుక..
కిమ్మనకుండా నోరు మెదుపరు..
రోడ్డుకెక్కి నిలదీయరు..
టీవీల్లో కనిపించరు..

రేటింగులకు వీడియోల మేకింగులు..
వీడియో ఎడిటర్ల డబల్ షిఫ్టులు..
నిరంతరం భయపెట్టే కథనాలు..
పనిలేనట్టు నమ్మే జనాలు..

పాకిస్థాన్ మీద యూద్ధం కాదు..
మన భూభాగంలో దాడులు..
రాజకీయ లబ్ధికోసం..
యువత భవిత రోడ్డుపాలు..

No Comments

Post A Comment

You don't have permission to register