Salar Dilkhush Salar

Salar Dilkhush Salar

😡 మారండి లేదా చావండి 😡
********************

మారండి
మగ వెధవ లారా !!
మారకుంటే చావండి
మమ్మల్ని ఇలా చంపకండి !!

ప్రేమ నిరాకరించామని
ఆసిడ్ తో దాడి చేస్తున్నాడొకడు !!
ప్రేమ నిరాకరించామని
నడిబజారున నరుకుతున్నాడొకడు !!
ప్రేమ నిరాకరించామని
నిలువునా తగలబెడుతున్నా డొకడు !!

ఏం
మనసు మీకే ఉందా
మాకు మనసులేదా !!
కోరికలు మీకేనా
మాకు ఉండకూడదా !!

మేమే
ఈ సృష్టికి ఆధారం
అమ్మగా మీకు జన్మనిస్తున్నాం !!
అక్కాగా మిమ్ములను ఆదరిస్తున్నాం
చెల్లిగా మిము అక్కున చేర్చుకుంటున్నాం !!
ఆలీ గా మీకు మా జీవితాలను అర్పిస్తున్నాం !!

ఇన్ని
సేవలకు గాను
మాకు ఇచ్చే బహుమానం చావైతే !!
అది మాకే ఎందుకు మీకెందుకు కాకూడదు !!
అందుకే
చావండి మగ వెధవలారా
చావక పోతే ఇకనైనా మారండి !!

ఆజాద్...
అనంతపురము.
28-02-2019.

No Comments

Post A Comment

You don't have permission to register