Nalla Yamini Reddy

Nalla Yamini Reddy

**ఎడబాటు**

నువ్వు నా వాడివి కాలేవు అని తెలిసి కూడా
నువ్వంటే ఇంత ప్రేమ ఎందుకు…?

నువ్వు వద్దనుకుంటున్న
ఇంకా నీ వెంటే పడుతున్నాను ఎందుకు..?

నువ్వు మొదటి నుండి ఇలాగే ఉంటే
నాకు అలవాటు అయ్యేదేమో..!

అప్పుడు నీ ప్రేమను, స్నేహన్నీ ఆదరణను చూపి..
చిరకాలం స్నేహంగా ఉంటానని ప్రమాణాలు చేసి
ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ?

ఈ నీ ఎడబాటు భరించలేకున్నాను…
మనసుకు ఎంత కష్టంగా ఉందో నీకు తెలుసా…?

నువ్వు ఇలా మరిపోతావని
కలలో కూడా ఊహించలేదు..

నేనెంత పిచ్చిదానిని ?
వస్తుగత ప్రపంచంలో ప్రతిదీ మార్పుకి ప్రతి క్షణం గురవుతదని తెలిసిన నేను
నీ మనసు నా పట్ల స్థిరంగా ఉంటుందని ఆశించడం తప్పేనేమో !

కానీ…,
నా రహస్య స్నేహితుడా !
నా చదువులో పదార్థ మార్పుకి సూత్రాలు చదివిన నేను
మన ఈ ఎడబాటుకి కారణాలు ఏవో చెపితే
ఇక నిన్ను ఇక ఇబ్బంది పెట్టక
నా దారిలో నే వెళ్లిపోతాను కదా…..!
మనుషులను చదువుతూ
మనసులను వదులుతూ …,
నీ……

( నా కవిత్వం ఒక మనసు పాడుకునే గీతం. అది స్వేచ్ఛగా ఊహల్లో ఎలాంటి నిబంధనలు లేకుండా గొంతెత్తాలనీ చేసే ప్రయత్నం.)

28.02.2019
…యామిని రెడ్డి

 

No Comments

Post A Comment

You don't have permission to register