Cv Suresh

Cv Suresh

ఈ కవిత చదివి అనువదిస్తుంటే, Karl marx చెప్పిన వాఖ్యలు గుర్తొచ్చాయి. “To be radical is to grasp things by root…”
నా చిన్నప్పటి నుండి నాకు పాత పాటలంటే ఇష్టం. ఇప్పటికీ నా ఫోన్ లో పాత పాటలే ఉంటాయి. అలా ఆ పాటలు వింటూ, ఆ పాత పాటలనే కొత్తగా ఎవరైనా రాస్తే, ఆశ్చర్యపడేదాన్ని. ఇలా ఎందుకు నేను రాయలేను నేను? అనే ఓ ఆసక్తే నాలో కవిత్వానికి అంకురార్పణ అయింది.
బి.ఇ. డి పూర్తి చెసుకొని ఖమ్మం ఖిల్లలో స్కూల్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సుభాషిణి తోట రాసిన “ఒకప్పుడు కవి ఉండేవాడు” అనే కవిత ను అనువాదం చేయడానికి పూనుకొన్నాను. “కవి సంగమం” సభ్యులకు క్రొత్తగా సుభాషిణి తోట గారిని పరిచయం చేసేది ఏమీ లేక పోయినా… ఆమె అభిరుచుల్ని, ఆమె సాహిత్య సాంగత్యాన్ని, కవిసంగమం పట్ల ఆమె కున్న గౌరవభావాన్ని ఇంకా కొన్ని విషయాలను ఆమె పదాల్లోనే విందాం. ఏ మాత్రం భేషిజం కానీ, హిపోక్రసి కానీ లేకుండా గల గలా పారే స్వచ్చమైన తెలంగాణా నదీ ప్రవాహం సుభాషిణి తోట.
ఆమె గురించి ఆమె మాటల్లోనే…
తండ్రి మంచి పేరున్న తెలుగు మాస్టారూ. చాల మంది మా ఊరిలో, చుట్టుపక్కల ఆయనను అభిమానించేవారు. నేనూ బి.ఇ.డి పూర్తి చేసాను. నాన్న 2014 లో చనిపోయారు. నాన్న కు గుర్తుగా ఏమి చేద్దాం అని ఆలోచన లో ఒక కవిత రాద్దాం అనే ఆలోచన. అంతే కాదు ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి అక్షరాలను ఆశ్రయించాను. అప్పుడు పేస్ బుక్ లో మణిమాలిక లాంటి గ్రూప్ లల్లో చిన్న చిన్న వాక్యాలు, కామెంట్ లు బాగా రాసేదానిని. ఆ వాక్యాలు కానీ, ఆ కామెంట్ లు కానీ కోత్హగా రాయాలని తపన పడేదానిని. అలానే రాస్తూ వచ్చాను. చాలామంది వాటిని ఇష్టపడేవారు. ఆలా అలా నాలుగు వాక్యాలు. పది లైన్స్.. చివరకు కవితలుగా రాస్తూ వచ్చాను.
నా మానసిక వొత్తిడి ని తగ్గించుకోనేడానికి కవితలు రాసేదాన్ని. అప్పట్లో మానసిక ఉద్వేగం, కానీ ఇప్పుడు, ఏవో కొత్తగా రాయాలంటే ఇష్టం. ఆసక్తి. నేను మాట్లాడినా కొత్తాగా మాట్లాడుతూ ఎదుటివారిలో ఆలోచన ను రేకేత్హించే౦దుకు ప్రయత్నం చేసేదానిని. చిన్నగా కవిసంగమం నన్ను add చేసుకోవడం, అక్కడ రాస్తూ, ఎవరైనా కొత్తగా రాస్తే, ఎంత బాగా రాసారో కదా? ఇలా నేను ప్రయత్నిస్తాను.. అని రాస్తూ వచ్చాను.
ఓ ఐదు నిముషాల్లో వ్యవధి లోనే రాసిన ‘నెలసరి మరకలు’ వేల సంఖ్యలో ఆ కవిత ను ఇష్టపడటం, 60 షేర్ లు రావడం చూసి అమితానంద పడి పోయాను. అక్షయ్ కుమార్ పాడ్మాన్ కింద రాసిన ఒక లైన్ చూసి, inspire అయ్యి ఈ కవిత రాసాను. నేనూ ఆడదాన్నే కదా, ఆ బాధలు పడేదానినే కదా అని కొంత అక్షరాల్లో ఆ బాధను పంచుకొనేందుకు రాసిన ఆ కవిత నాకు అత్యంత ఆనందాన్ని మిగిలిచింది.
నేనంటూ కవిత్వం లో నిరాశ పడిన సందర్భాలే లేవు. ప్రతి రొజు ఏదో ఒకటి రాస్తాను. కవిత రాయక పోతే నాకు వెలితి. రెండు వాఖ్యాలు రాసినా, సంతృప్తి. కోత్హగా ఎవరైనా రాస్తే, వెంటనే నా కళ్ళు ఆ కవిత వైపుకు పరిగేత్హేవి. ఓ ఐదు నిముషాల్లో, బస్సులో వెళుతూ, ఆటో లో వెళుతూ, కన్నీలు కార్చినా, సంతోషం చెందినా, ఎవరైనా బాధ పెట్టినా, వెంటనే నా ఆలోచన అక్షరాల్లోకి తద్వారా కవిత లోకి వెళ్లి ఆశ్రయిస్తాను.
కవిత్వం పట్ల అభిరుచి మొదటి నుండి ఉండేది. నాన్న చనిపోయే సరికి అది బయటకు వచ్చింది. ఇప్పుడు ఆసక్తి తో రాస్తున్నాను.
కవిత్వంను ఒక్కొక్కరు ఒక్కో కోణం లో చూస్తారు. కొందరు అభ్యుదయం అంటారు. అందులోనే విప్లవం అంటారు. కొందరు మానసిక సంఘర్షణ అనుకొంటారు. కొందరు మానసిక సంతోషాన్ని అనుకొంటారు. నా వరకు మానసిక సంఘర్షణ, మానసిక సంతోషం ల నుండే కవిత్వం వచ్చేది. అలా పుట్టి౦దే అభ్యుదయమైనా. విప్లవమైనా. కాకాపోతే అది కాస్త ఎర్రగా ఉంటుంది. ఇది కాస్త పచ్చగా ఉంటుందన్నది నా ఆలోచన.
పక్క తెలంగాణా అమ్మాయినే. ఖమ్మంలోనే నేను పుట్టి పెరిగినా, నాకు తెలంగాణా యాస రాదు. మాట్లడేవాల్లను చూస్తే ఇష్టం. అమ్మా నాన్న ఇద్దరూ టీచర్లే. వాళ్లెప్పుడూ తెలంగాణా బాష లో మాట్లాడే వారు కాదు. అమ్మది ఒరంగల్, నాన్నది నల్గొండ. చదువు, క్లాస్, ఇల్లు తప్ప నాకు ఇంకో ప్రపంచం లేదు. నేను మాట్లాడితే ఆంధ్రా అమ్మాయి అనేవారు.
సంఘర్షణ ఎవ్వరికైనా ఉండాలి. ఎంతమంది ఏమి చేసినా, ఏమి రాసినా, జయి౦చాలే కానే, ఓడిపోయినా అందులోనూ సంతోషాన్నే చూడాలి అనుకొంటాను. తెలంగాణా ఉద్యమం అనే అంశం నాపైన ప్రభావం పడలేదని చెప్పలేను కానీ, నేనంత ఉద్రేక పడను. సహనం తో, శాంతి తో ఏదైనా సాధించగలననే నమ్మకం నాది. ఆ దిశ లోనే పయనించాను.నాన్న, చదువు, పుస్తకాలు. ఇల్లు నా ప్రపంచం. ఇంకే విషయాలపై ఆసక్తి ఉండేది కాదు.
ఏడాది క్రితం సుభాషిణి గారి కవిత్వానికి, ఇప్పటి కవిత్వానికి పెద్ద తేడా కనిపిస్తుంది. దానికి కారణమేమంటారు? ::
అనే ప్రశ్నకు ఆమె నోటి నుండి వెంటనే, “కవిసంగమం” నన్ను ప్రభావితం చేసింది. కంచర్ల శ్రీనివాస్ గారు, ఆనందాచారి గారు,, ఇబ్రహీం గారు, సునంద మేడం కానీ, యాకోబ్ గారు కానీ, వీళ్ళంతా ఖమ్మం చుట్టూ ఉండేవాల్లె. వీళ్ళ పరిచయాలు, వీరి కవిత్వాలు వల్ల ఇంకొన్ని కొత్త పుస్తకాలు నాకు అందుబాటులోకి వచ్చాయి. వాటిని చదువుతూ వచ్చాను. కోత్హగా రాయాలన్న నా అభిరుచే నన్నుఒక స్థాయికి చేర్చింది.
మొట్ట మొదట నా చేతికి వచ్చిన ఒక అద్బుత పుస్తకం “ఫత్వా”. పుస్తకం చదివిన తర్వాత ఆశ్చర్యం కలిగింది. అది నాకు ఒక గ్రంధాలయం లాగా పని చేస్తాది. ఇప్పటికీ కొన్ని అంశాలు అందులో నుండి తీసుకొంటాను. అలా పుస్తకాలు చదివి, ఎలా రాయాలో ? ఎలా రాయకూడదో కూడా తెలుసుకోన్నాను.
మీకో కొత్త డిక్షన్ ఏర్పడటానికి ఏదైనా కారణమా? అని అడిగితే, నిర్దిష్టంగా చెప్పలేను కానీ, త్రివిక్రం శ్రీనివాస్ కు నేను పెద్ద అభిమానిని. ఆయన పంచ్ లు వేస్తుంటే, అలా వింటూ ఉండిపోయేదానిని. అలా ఎందుకు మాట్లాడకూడదు? రాయకూడదు? అన్న నా ఆలోచనే బహుశా ఆ కొత్త డిక్షన్ ఏర్పడటానికి కారణం అనుకొంటున్నాను. అందరికి నచ్చేలా రాయలనుకొంటాను. నచ్చిందా సంతోష పడుతాను. నచ్చలేదా ఇంకోలా రాసేందుకు ప్రయత్నిస్తాను.
కవిసంగమం అయితే వంద శాతం నాకు సపోర్ట్ ఇచ్చింది. కవిసంగమం లోని ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేస్తాను.
మూడు సంకలనాలు వేసాను. “శిధిలల్లో మొలిచిన అక్షరాలు”. రెండోది “థర్డ్ వాయిస్”. మూడోది “ కవిత్వం మండుకొస్తుంది”. ఇందులో నా కవితలు ఒక్కటే కాదు. నలుగైదురుగురు కవుల కవితలు కలిసి ఈ సంకలనాలు వేసాను. వీటికన్నిటికి నేనే సంపదకురాలిని.
ఇక ఈ కవిత విషయానికొస్తే, అనుసృజన చేసేందుకు ఆమె మనసు చదవడం తోనే సాధ్యపడి౦ది. తాను చెప్పదలచుకొన్న వస్తువును ఎక్కువ ఉద్రేక పడకుండా, సరళంగా రాసిన ఈ కవిత, వాస్తవానికి అనువాదానికి వొదగదు. చాల చోట్ల పూర్తి స్వేఛ్చ ను తీసుకొన్నాను.

No Comments

Post A Comment

You don't have permission to register