‎Cv Suresh‎

_Cv Suresh_

‎Cv Suresh‎

“నా పేరు ఆనందు. నా ఊరు ఇల్లెందు” అని విజయవాడ లో ఒక సభలో నేను నా పరిచాయం చేసుకోగానే, అక్కడే ఆసీనులైన ‘ఆరుద్ర’ గారు గొల్లున నవ్వారు. 
..
నా మొదటి సంకలనాన్ని నా తల్లి తండ్రులకు అంకితమిచ్చాను. నా తండ్రి అప్పటికే లేరు. నా తల్లి నా సంకలనాన్ని చూసుకొని మురిసిపోతుంటే, నేను నా జీవితం లో అత్యంత ఆనంద పడిన సందర్భం ఇదేనండి….ఆ తర్వాత ఒక మంచి కవిత రాసిన ప్రతి సారీ దాన్ని చూసుకొని నేను ఆనంద పడుతూనే ఉంటాను.

కవిత్వం సెన్సేషన్ కోసం కాకూడదు. కవిత్వం జర్నలిజం కాదు. అది హృదయాన్ని తట్టి లేపగలగాలి. కవిత్వం కీర్తి కోసం ప్రాకులాట కారాదు. కవిత్వం రాస్తూ పోతుంటే, ఆ కీర్తి అదే వస్తుంది..కవిత్వం ఒక వృత్తి కావలి. ఒక వృత్తి కారుడు తన పని పట్ల ఎంత ఏకాగ్రత తో పని చేస్తాడో, అంతే ఏకాగ్రత కవిత్వం పట్ల ఉండాలి. ఒక చర్మకారుడు కానీ, ఒక చేనేత కార్మికుడు కానీ, ఒక కంసాలి అయినా , దాని నుండి ఎంత సంపాదిస్తాడో ఆలోచించడు. కానీ, ఎంతో ఏకాగ్రత తో ఒక నిబదత్త తో పని చేస్తారు. 
కవికి సామాజిక చూపు అవసరం. ఒక సామాజిక దృక్పధం లేకుంటే, కవిగా మనగలగలేరు.

తెలంగాణ ఉద్యమ నేపధ్యం లో సాహితీ కారుడుగా ఇల్లెందు గ్రామం లో మొలకెత్తి ఇల్లెందు, వరంగల్ లలో చదువు పూర్తి చేసుకొని, తెలుగు ఉపాధ్యాయులుగా స్థిరపడిన ఒక సాహితీ విభ్రమం, ఒక సాహితీ కారుడు, కవి ఆనందాచారి కటకోజ్వాల గారు ఇవాళ మన కవిత్వానువాద శీర్షిక కు అతిధి.

నేను నా యాసంగం పూర్తి చేసుకొని, అర్ధరాత్రి 12 గంటలకు నేను కాల్ చేసి మాట్లాడినా, చాల ఓర్పుగా సమాధానం ఇస్తూ, సాహిత్యం లో లీనమై సమాధానం ఇచ్చిన ఆయన లో సాహిత్యం పట్ల ఒక తపన చూసాను. 
తన ఊరంటే ఆయనకు చాల చాల మక్కువ. అతడు చాల గర్వంగా ఫీల్ అవుతారు. ఆయన మాట్లాడుతూ , 200 ఏళ్ల క్రితం నల్ల బంగారం దొరికిన చోటు ఇదే సర్…. బ్రిటిష్ వాళ్ళు వంట చేసుకొంటుంటే, అక్కడ రాయి కాలడం చూసి, వాళ్ళు విచిత్రంగా భావించి, ఆ వార్త బ్రిటిష్ వాళ్లకు తెలిసి, వాటిని వెలికి తీసారు. అన్ని వనరులు ఉన్న ప్రాంతం ఇల్లెందు. అది ఇప్పుడు కొత్త గూడెం , బద్రాచలం జిల్లాలో ఉంది. అంతకు ముందు ఖమ్మం జిల్లా, అని చాల ఆనందంగా చెప్పుకొచ్చారు.

మీరెప్పుడైన ఈ సాహితీ ప్రయాణంలో సాహిత్యం పట్ల నిరాశ చెందారా? అన్న నా ప్రశ్నకు ఒక్కసారిగా ఆయన చాల ఉద్వేగంగా….. అస్సలు లేదండి. పైగా నాకు ఇంకా సాహిత్యం పట్ల భావిష్యత్తు పైన కూడా అపారమైన విశ్వాసం. ఆశ ఉంది. నా కవిత్వం, నా సాహిత్యం నన్ను ఒక వ్యక్తిత్వం గల మనిషిగా నన్ను ఈ సమాజానికి పరిచయం చేసింది. అని చెప్పారు….
..
ఆయన తో జరిగిన ఆ సంబాషణ మొత్తం ఆయన మాటల్లోనే విందాం..
ఇంటర్ స్థాయిలోనే నేను ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాను. 17 ఏళ్ల నాడే పాట రాసాను. పాటలు చాల రాసిన తర్వాతే నేను కవిత్వంవైపు కు వచ్చాను. నేను లెఫ్ట్ కార్యక్రమాల్లో బాగా చురుకుగా పనిచేసాను. అంతకు ముందు ప్రజానాట్య మండలి లో నాటకాలు వేసాను. రాయడం మొదలు పెట్టినాను. మొదటి పాట స్త్రీ వివక్ష పైన రాసాను. నా చుట్టూ, సిపిఐ, సిపిఐ (ఎం,ఎల్) వాళ్ళే ఉండేవారు. వాళ్ళ ప్రభావం, అంటే, వాళ్ళ పాటలు, వాళ్ళ ప్రసంగాలు, ఆ రిథం నా పైన బాగా ప్రభావితం చేసింది. సామాజిక ప్రయోజనానికి ఉపయోగి౦చాలానే ఒక పెద్ద కోరిక కలిగింది. డిగ్రీ లోకి వచ్చాకే కవిత్వం రాయడం మొదలు పెట్టినాను. ఖాదర్ బాబు అనే కవి ఉండేవాడు. అతడూ నేనూ కలిపి కూడా రాసాము. 
మహా ప్రస్తానం, సీవీ గారి పుస్తకాలు ఇంటర్ స్థాయి లోనే చదివేసాను. నాకు బాగా నచ్చేవి. అందులో భాగంగానే అవన్నీ నాకు ధారణ వచ్చేసింది. ఇవన్నీ నేను ఇంటర్ లోనే అలవోకగా చెప్పేవాడిని. చాల ఆలస్యంగా 2006 లో నేను మొదటి సంకలనం వేసాను. అది “మొలక”. తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య గారి శత జయంతి సందర్భంగా, ఆయన జీవితాన్ని దీర్ఘ కావ్యంగా రాసాను. దాని పేరు ‘స్ఫూర్తి శిఖరం’ . తర్వాత, కాళోజీ జీవితాన్ని, విద్యార్థులకు ఉపయోగపడేలా రాసాను. దాని పేరు “మన కాళోజి”. తర్వాత, ఇటీవలే, కార్ల్ మార్క్స్ 200 ఏళ్ల జయంతి సందర్భంగా “మహోన్నతుడు మార్క్స్” అని ఒక పుస్తకాన్ని వేశాను. ఆయన స్నేహాన్ని, ప్రేమను తీసుకొని, యువత కు పరిచయం చేస్తూ, ఒక 56 పేజీల పుస్తకాన్ని పబ్లిష్ చేసాను. ‘ప్రస్థానం’ సాహితీ పత్రిక లో పదేళ్ళ పాటు సంపాదక సభ్యుడిగా ఉండినాను. అది మంత్లీ మగజిన్. ఇప్పుడు కొత్త కవితా సంకలనం తీసుకొస్తున్నాను. దాని పేరు “inner sea” పెడదామని అనుకొంటున్నా. అంటే, “అంతః సముద్రం”. సమీక్షలు రాసాను. విమర్శ పైన ఒక పుస్తకం ఇప్పుడు పబ్లిష్ చేయాల్సి ఉంది. తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి చెందిన “ilusion and reality” అనే క్రిస్టఫర్ గారి లిటరరీ విమర్శ పుస్తకాన్ని, నేను తెలుగు లోకి అనువదింప చేసి, “భ్రమ- వాస్తవం” పేరిట పబ్లిష్ చేసాను.
.. 
1999 లో సాహితీ స్రవంతి అనే ఒకసంస్థ ను ప్రారంబించాను. 2000 నుండి ఆ సంస్థ రాష్ట్రం మొత్తం organise చేయబడింది. ఆ పేరు పెట్టింది కూడా నేనే. విభజన తర్వాత, ఏ.పి. లో ‘సాహితీ స్రవంతి’ అని ఉంది. తెలంగాణా లో ‘తెలంగాణా సాహితి’ అని పేరు పైన ఉంది. ఇప్పుడు నేను స్టేట్ కన్వీనర్ గా ఉన్నాను.

కవిత్వం ప్రజలకు రీచ్ కాక పోవడానికి కారణాలు అనేకం. సమాజిక ఆర్ధిక వేగం లో భాగంగా కవిత్వాని చూడాలి సర్. కవిత్వం ఒక్కటే, కాదు, ఏ విషయం కూడా ప్రజలకు రీచ్ కాని సందర్భం లో మనం ఉన్నాము. అంటే, హృదయ స్పందనలను ఏవీ కూడా ప్రజలకు అందనివ్వని సామాజిక సందర్భం లో ఉన్నాము. ఇది కవిత్వానికి ఒక్కదానికే అపాదించాల్సిన పని లేదు. అప్పటికి, ఇప్పటికీ, సామాజిక, ఆర్హిక మార్పు వేగవంతమయ్యాయి. మనిషిని పరిగెత్తిస్తోంది. ఈ పరుగు ఏదో పొందాలన్న తపన ను పెంచింది. ఏమి పొందాలి ? అన్న ప్రశ్న కు ఎవరి దగ్గరా సమాధానం ఉండదు. అందులో మనం కవిత్వాన్ని చూస్తే, మనం రీచ్ అవ్వనట్లే. అయితే, ప్రవాహానికి ఎదురీదే వ్యక్తులు అప్పటికీ ఇప్పటికీ ఉండనే ఉంటారు. కవిత్వం ఇంకా బ్రతకడానికి ఉన్న స్ఫూర్తి ఏమంటే, మనిషి లో మనిషితనం ఇంకా చావలేదు. సామాజిక ,ఆర్ధిక వేగం లో భాగంగా, ఈ కవిత్వం అనాసక్తి అయ్యి ఉండొచ్చు. అదే కవిత్వాని కూడా దూరంగా ఉంచొచ్చు. కానీ, కవిత్వం పట్ల నిజంగా ఎవ్వరికీ వ్యతిరేకత ఉండదు. అది బ్రతికే ఉంటుంది.కవిత్వం బ్రతికి ఉంటె, మనిషితనం కూడా బ్రతికి ఉంటుంది. 
..
అప్పట్లో, కవిత్వం కు సామాజిక ఉద్యమం కవిత్వానికి ఉద్వేగం ను ఇచ్చేది. కానీ, ఇప్పుడు , అలాంటి ఉద్వేగాని ఇచ్చే ఉద్యమాలు లేవు. అందుకు కవి తన స్వీయ ఉద్వేగాన్నే కవిత్వంగా మలుస్తున్నారు. 
..
రాసేవాళ్ళు ఎక్కువయ్యే కొద్దీ, అకవిత్వం కూడా ఎక్కువయ్యింది. అకవులు, అకవిత్వం సమస్య ఇప్పడిదె కాదు. ఎప్పటి నుండో వస్తోంది. అందుకే మనకు అకవిత్వం ఎక్కువ కనబడుతుంది. అయితే, ఈ అకవిత్వం లో పాజిటివ్ పాయింట్ ఏమంటే, కవిత్వం రాయాలన్న ఉత్త్సుకత, ఆ కవిత్వం రాస్తే, ఉన్నతంగా ఉండగాలుగుతామన్న వారి మనస్తత్వం. అది కవిత్వం యొక్క గొప్పతనం గా భావిస్తాను. అయితే, ఈ ఆకవులను ఉత్తమ కవులుగా తీర్చి దిద్దాలనే, పదేళ్ళ క్రితమే, మేము కవిత్వ కార్యశాలాలను ఏర్పాటు చేసాము. అలంకారికులు ఏమి చెప్పారు? కవిత్వం ఎలా రాయాలి? అని అక్కడ చెప్పేవాళ్ళం. ఇప్పటికీ కూడా అవి జరుగుతున్నాయి. ఈ ధోరణుల్లో కూడా, సమాజానికి అవసరమైన విషయాలు ఉంటాయి. కవులకు సమాజాన్ని తీక్షణంగా చూసే చూపు కావాలి. వైపరిత్యాలన్నీ కవిత్వం లో, సాహిత్యం లో కూడా ఉంటాయి.. 
..
అప్పట్లో, ఉద్యమం లో సంబంధం ఉన్నవాళ్ళే మహా కవులుగా ఉండేవారు. ఇప్పడు ఏ ఉద్యమం లేకున్నా మహా కవులు అవుతున్నారు. ఆచరణ కవిత్వం రెండూ ఒకటిగా ఉండేవి. ఇప్పుడు ఆచరణ వేరు, కవిత్వం వేరు. అక్కడే, ఈ అకవిత్వం, కవిత్వం పేలిపోవడం వంటి వాటిని మనం స్పష్టంగా చూస్తాం., 
..
కవి సంగమం ఒక మంచి వేదిక, ఇతర సాహితీ సంస్థలు చేసే పనిలాగే, ఈ సంస్థ కూడా కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత నిస్తూ ప్రోత్సహించడం ఆహ్వనించ దగిందే. అయితే, ఇప్పుడు వ్యక్తులు సంస్థలయ్యాయి. అంటే వ్యక్తి సంస్థ అయ్యాడు. సంస్థలో వ్యక్తులు లేరు. అయినా, అందులో మనకు పనికి వచ్చే అంశాలు చాల ఉంటాయి. అవి స్వీకరించాలి. ఇపుడు ఉన్న ప్రమాదాలను ఎదిరించాలంటే, సమూహం ఉండాలి. కవిత్వపు పుట్టుకే సమూహం నుండి. సమూహపు ఉద్వేగమే కవిత్వం. సమూహం లేకుంటే, నిరామయమే. సామూహిక తత్వం పోయింది కాబట్టే, కవిత్వం కూడా ఒంటరి అయ్యింది. మనిషి ఎందుకనో వైయుక్తం అవుతున్నాడు.

ఈ తరం కవులు బాగా చదవాలి. రాయటమే కాదు. కవిత్వాన్ని చాలామంది చదవట్లేదు అని నా భావన. కవులుగా తయారు కావాలన్న తపన ఉండాలి. దాని పైన శ్రద్ధ పెట్టాలి. ఏదో నాలుగు కవితలు రాసేసి, పేరు రావాలన్న కోరిక తప్పు కాదు కానీ, కేవలం తాపత్రయం కవిత్వాన్ని నిలబెట్టదు. 
కవిసంగమం లో ప్రతి రోజు వచ్చే శీర్షిక లు అద్బుతం. ఏది కూడా చదవకుండా వదలను. చాల ఉపయోగకరం. రాసేవాళ్ళకు , చదివేవాళ్ళకు ఉపయోగమే. భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. అయితే ఈ ప్రాసెస్ చాల అవసరం. ముఖ్యంగా పాత , కొత్త తరపు కవులకు మంచి అవకాశంగా భావిస్తాను. నాకైతే ఒక మంచి చాల ప్రయోజనకారిగా భావిస్తాను.
.. 
ఇలా గంట సేపు, మాట్లాడిన తర్వాత, ఇంకేదైనా అనుమానం వచ్చినా, మీకు ఫోన్ చేయవచ్చ? అని అడిగితే, ఎప్పుడు ఫోన్ చేసినా నేను స్పందిస్తాను. అని చెపుతూ, నాతో బాగా మాట్లాడించారు సార్ మీరు. నేను బాగా మొహమాటస్తుడిని. తక్కువ మాట్లాడుతాను.అయితే నన్ను బాగా involve చేయించి మాట్లాడించారు. చాల ధన్యవాదాలు సర్ అని ముగించారు. కవిత విషయానికొస్తే, చాల వాడుక బాష ఉన్న కారణంగా, పూర్తి స్వేఛ్చ ను తీసుకొని అనుసృజన చేసాను.

ఆనందాచారి కటకోజ్వల || గాయాల అనుభవం కావాలి ||
అనుసృజన : సి.,వి.సురేష్ || Need idyll of wounds…||
..
Alike, 
Piercing into n’ with the forming blisters…
Bearing the padded pains…
The empiricism of hooves..
Walking on the boulders..
Soul also need the pain of the wounds…
..
Alike…
The experience of the burning foot
in the hot sunny day..
The heart should also know it
..
Alike
The scarred skin in the rough threaded bed…
N’ the pained rib on the wild-date’s leaf mat 
N’ the toughness of earthen on flaked floor 
The soul should become harden 
..
Alike the experience of …
The hungry cries…
The shivered cold scenes..in a roofless house…
The reddish eyes 
of sleepless nights due to rain
the soul also should feel…!!
..
The chapped nail of shanka in the sprint
The bleeding of the broken knee..
The pain of turmeric applied wounds….
Should touch the soul….!!
..
The body challenged the torment…
With the vast experiences…
By bearing..lots of tough times n’ wounds
..
Even the inner soul also 
Sprout like saga of songs…
from its sliced wounds
n’ the pains spate like preaches..!!

ఒరిజినల్ పోయెమ్ : 
..
గుచ్చుకుంటూ బొబ్బలు కడుతూ 
ఒత్తుకుపోతూన్న బాధను భరిస్తూ 
రాళ్ళపైనడు‌స్తున్న పాదాల అనుభవంలాంటి 
గాయాలదుఃఖాలు మనసుకూ కావాలి 
..
ఎర్రటి ఎండలో చుర్రుమనికాలే 
కాళ్ళనడకల్లాంటి అనుభవం 
మనసుకూ తెలియాలి….. 
..
నులక మంచం పడకలో 
అచ్చులుబడ్డమేనులా 
పొక్కిలినేలపై ఈతసాపలో పక్కటెముకనొత్తిన 
మట్టిగట్టితనంవోలె
మనసుకూ భూమితనం తగిలి గట్టిపడాలి 
..
పెద్దపేగు ఆకలి శబ్దాలు 
కప్పులేక వణికిన చలి దృశ్యాలు 
వర్షానికి నిద్దుర లేని ఎర్రనినేత్రాలు లాంటి 
అనుభవాలు మనసుకుకూడా కలగాలి 
..
పరుగులో పడితే తెగిపడ్డ కాలిగోరు 
పగిలిన మోకాలు నెత్తురు ధార
గాయాలపై పసుపునద్దిన మంటరుచి 
మనసుదేహాన్నీ తాకాలి …
..
ఎన్నెన్నో గరుకుతనాలని గాయాలని 
ఓర్చుకుని ఓర్చుకుని అపార అనుభవంలోనే 
కాయం గాయాలనెదురుకొంది …
..
మనసుకూడా అంతే 
తనను కోసిపోయిన గాయాల్లోంచి ధారలుగా 
గేయాలు పెల్లుబుకుతాయి
బాధలు బోధనలై వెల్లువెత్తుతాయి

No Comments

Post A Comment

You don't have permission to register