డి.వి.వి. సత్యనారాయణ ఋషి

డి.వి.వి. సత్యనారాయణ ఋషి

యుద్ధం#

ఒక పచ్చి నెత్తుటి తడి యుద్ధం
కమురు వాసనల చితిమంటల సెగ యుద్ధం
నేల లో నాటే నెత్తురు విత్తులే యుద్ధం 
నేలకొరిగిన తెగిపడిన చెయ్యే యుద్ధం
అర్ధరాత్రి ..హఠాత్తుగా
నాన్న కావాలని ఏడ్చే పసిపాప ఏడ్పే యుద్ధం
సగంలో చిధ్రమైన చిన్నారి కల
‘ఎప్పటికీ రాని నాన్న’ కఠిన నిజం యుద్ధం
కంటిపాప మీద పడగై కాటేసే పీడకలే యుద్ధం
మాగన్ను నిద్రలో
వెన్నుపాము గుండా చర చరా పాకే పామే యుద్ధం
ఆకాశంలో గ్రద్దను చుాసి
తల్లి కోడి రెక్కకింద దాగిన బతుకు భయం యుద్ధం
ఎదురు చుాపుల కంటి కొసన జారిపడిన చివరి ఆశే యుద్ధం
తల్లిపేగు మడతబడ్డ పంటి బిగువు బాధే యుద్ధం
వెంటబడి తరిమే ఆకలి బుల్లెట్ల వర్షమే యుద్ధం
లోహవిహంగపు రాకాసి గోళ్ళు పరుచుకున్న కీనీడే యుద్ధం
ఒక రాజకీయ రణ నినాదం యుద్ధం
గాయపడిన సైనికుడి ఆర్తనాదం యుద్ధం
మొండి గోడలు
మొండి చేతులు ఎగరవేసే విజయకేతనమే యుద్ధం
శవపేటికపై కప్పబడిన పతాక రెపరెపలే యుద్ధం
ఇంటికి తెచ్చుకొన్న చేదు జ్ఞాపకాల
యుానీఫార్మ్ కవరే యుద్ధం

యుద్ధం అంటే
మనుషుల్ని చంపడమే కాదు!
మనుషుల్ని గెలవటం కుాడా..!!
27.02.’19 — ఋషి.

No Comments

Post A Comment

You don't have permission to register