About Us

Who Are We

ఇదొక కవిత్వ పాఠశాలలాంటి వేదిక. కొత్తతరానికి లాంచింగ్ పాడ్ లాంటి వేదిక. ఏడేళ్లుగా కవిత్వంకోసం నిలబడిన కవిత్వవేదిక. వచనకవిత్వం గురించి, కవిత్వసృజన, తత్సంబంధిత అంశాల గురించి నిరంతర సంభాషణ కొరకు ఒక వేదికగా ఈ సమూహం ఏర్పరచబడింది. కవిత్వవాతావరణం సదా నెలకొనిఉండేట్లు చూడటం, కొత్తతరం కవిత్వాన్ని ఉత్సాహపరచడం, కవిత్వసందర్భాలను సృష్టించడంద్వారా ‘జయహో కవిత్వం’ స్ఫూర్తిని నింపడం ఉద్దేశ్యం. కార్యక్రమాలు- నిర్వహణ

**** – కవిత్వసృజన, కవిత్వపఠనం, కవిత్వ సంబంధిత అంశాలు – శీర్షికలు, వ్యాసాలు, చర్చలద్వారా అవగాహన చేసుకుంటూ ముందుకు సాగుతుంది. అలాగే ‘కవిసంగమం కవిత్వపఠనసీరీస్ లు’పోయెట్రీ వర్క్ షాపు’ల్లా జరుగుతున్నాయి.

*** వీలయినప్పుడల్లా కవిత్వానికి సంబంధించిన అంశాలను వాల్ మీద పోస్ట్ చేస్తూ, ప్రముఖ కవులతో ముఖాముఖి ద్వారా కవిత్వ రచన గురించిన విషయాలు నేర్చుకుంటూ ‘లర్నింగ్ ఇన్ ప్రాసెస్’ మార్గంలో కవిసంగమం సాగుతుంది. …………………………..

You don't have permission to register